Thursday, 5 November 2026

తెరాస అభివృద్ధి చూసి ఓర్వలేక నే అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

తెరాస అభివృద్ధి చూసి ఓర్వలేక నే అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ

ఉనికిని చాటుకోడానికే కాంగ్రెస్ శాంతియుత ర్యాలీలు

ప్రజలు తెరాస ప్రభుత్వం చేప్పట్టిన అభివృద్ధి పనులు చూస్తున్నారు

కాంగ్రెస్ జూట మాటలు ప్రజలు నమ్మరు

తెరాస మండల అధ్యక్షులు తాళ్ళ పెళ్లి రాజ గంగన్న

 

ఖానాపూర్ రూరల్ 22 నవంబర్ (జనం సాక్షి):తెరాస ప్రభుత్వం లో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ సారథ్యంలో చేబడుతున్న ఖానాపూర్ లోని అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక నే కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని ఖానాపూర్ తెరాస పార్టీ మండల అధ్యక్షులు తాళ్ళ పెళ్లి రాజ గంగన్న అన్నారు.మంగళవారం ఎమ్మెల్యే నివాస గృహం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేవలం ఉని కిని చాటుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుత ర్యాలీ చేపట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారూ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ జూట మాటలు ప్రజలు నమ్మరు అని,ప్రజలు తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు చూస్తున్నారు అని ఆయన అన్నారు. ఖానాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ నుండి తెరాస ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే రేఖ నాయక్ కృషితో మున్సిపాలిటీ గా అభివృద్ధి చెందిన విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించటం లేదా అని అన్నారు.త్వరలో తెరాస ప్రభుత్వం చెప్పట బోయే కంటి వెలుగు కార్యక్రమంలో చూపెట్టుకోవలని ఆయన అన్నారు. ఒక ఇంటి నిర్మాణం చేసేటప్పుడు పని చేసే వాళ్ళు ఎంత ఇబందీ పెట్టుతారో ,ఖానాపూర్ లో చేపడుతున్న రోడ్డు ,డ్రైన్ పనులకు కూడా చిన్న పాటి ఇబ్బందులు వస్తాయి దాని ఆసరాగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖానాపూర్ లో అభివృద్ధి పనులు జరగడం లేదు అని అనడం ఎంత వరకు సమంజసం అని ఆయన అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ సంబంధిత కాంట్రాక్టర్లు కు పని విషయమై త్వరితగతిన పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు అని ఆయన అన్నారు.జనవరి నాటికి డబుల్ బెడ్ రూమ్ పనులు పూర్తి స్థాయిలో ముగుస్తాయని అరుహులైన వారికి త్వరలో అందిస్తామని ఆయన అన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయక్ తన సొంత ఊరిలో ఉంటూ అభివృద్ధి పనులే ధేయంగా ఎప్పటికప్పుడు పాలక వర్గానికి సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశలో తీసుకుళ్తున్నారు అని ప్రజలు మళ్ళీ తెరాసకు పట్టంకట్టి మళ్ళీ ఖానాపూర్ లో తెరాస ఎమ్మెల్యే రేఖ నాయక్ విజయడంక మోగిస్తుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్,వైస్ చైర్మన్ కలిల్,ఎంపిపి మోహిద్,పట్టణ అధ్యక్షుడు పరిమి సురేష్ ,పెంబి మండల అధ్యక్షుడు సల్ల నరేందర్ రెడ్డి,డి ఆర్ బి ఎస్ డైరెక్టర్ కొక్కుల ప్రదీప్,పత్రి శ్రీనివాస్,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గొర్రె గంగధర్,కౌన్సులర్ జన్నారపు శంకర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పరంకుశం శ్రీనివాస్,తెరాస పార్టీ నాయకులు కౌట మహేష్,వెంకటప్పయ్య,ద్యావతి రాజేశ్వర్,ప్రభాకర్,నగేష్,చంద్రహాస్,పాల్గొన్నారు.