రాబోవు వేసవి కాలంలో విద్యుత్, తాగునీరు, సాగునీరు, ప్రజలకు అందుబాటులో ఉండాలి
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సంధ్య తిరుపతి యాదవ్
గోపాల్ పేట్ జనం సాక్షి నవంబర్ (22): స్థానిక ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో హుస్సేన ప్ప ఆధ్వర్యంలో ఎంపీపీ సంధ్య తిరుపతి యాదవ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. మండలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పైన, వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో చర్చించారు. అంగన్ వాడి సెంటర్లలో టీచర్లు సమయపాలన పాటించాలని విద్యార్థులకు, గర్భిణీలకు,బాలింతలకు అందించే పౌష్టికాహారం నాణ్యవంతంగా అందించాలని సెంటర్లకు అందించే గుడ్లు పాడవకుండా తగు జాగ్రత్తలు అంగన్ వాడి టీచర్లు తీసుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాతకు సూచించారు మండలంలోని ప్రతి అంగన్ వాడి సెంటర్ పై సూపర్వైజర్ పర్యవేక్షణ ఉండాలని సమావేశంలో చర్చించారు మరియు గ్రామాలలో ప్రతి ఒక్క ఓటర్ కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేసే విధంగా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని డిప్యూటీ తాసిల్దార్ జాకీర్ హుస్సేన్ ప్రజాప్రతినిధులకు తెలిపారు ఆన్లైన్లో నూతన రేషన్ కార్డులకుదరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి అనుమతి రాగానే కొత్త రేషన్ కార్డులు వస్తాయని ఆయన అన్నారు విద్యుత్ శాఖకు సంబంధించి ఏ ఈ నీ ఆయా గ్రామాల సర్పంచులు థర్డ్ వైర్ సిస్టం కొరకు కరెంటు స్తంభాలు కావాలని ఏ ఈ నీ కోరారు సర్పంచులు అడిగిన కరెంటు స్తంభాలను సమకూరుస్తామని ఏ ఈ సమాధానం ఇచ్చారు అదేవిధంగా లో వోల్టేజ్ గల ట్రాన్స్ఫార్మర్ల దగ్గర అదనంగా ట్రాన్స్ఫార్మర్లు నిర్మించేందుకు ఏ ఈ పై అధికారులకు నివేదికలు పంపిస్తామన్నారు మండలంలో 50 ట్రాన్స్ఫార్మర్లు అయితే లో ఉంటే ఈ సమస్య తీరుతుందని అన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ సంధ్య తిరుపతి యాదవ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో విద్యుత్, తాగునీరు,సాగునీరు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారుఅన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ మండల అభివృద్ధికి పాటుపడాలని కోరారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన చర్చించడానికి జరిగే ఈ సమావేశానికి ఆర్ అండ్ బి, మత్స్యశాఖ, హార్టికల్చర్, అధికారులు గైర్హాజర్ కావడం వల్ల ఆయా శాఖల లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రజా ప్రతినిధులు ఎవరికి చెప్పాలని వారన్నారు పలు శాఖల అధికారులు వారి పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఈ సమావేశంలో వివరించారు
ఏదుల ఎంపిటిసి 2 ఆవేదన
మండలంలోని అనంతపురం గ్రామ ప్రజలకు వ్యవసాయం చేయడానికి సాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీటీసీ సుల్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీపీ మాట్లాడుతూ సాగునీటి సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
మండల సర్వసభ్య సమావేశంలో అన్ని గ్రామాల సర్పంచులు గ్రామాలలో అభివృద్ధి పనులను చేపట్టిన వాటికి బిల్లులు రాకపోవడంతో కొత్తగా మంజూరైన పనులను చేయలేకపోతున్నామని సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచులు వాపోయారు
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, కో ఆప్షన్ సభ్యులు మతిన్, ఎంపీడీవో హుసేన ప్ప, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు తిరుపతి యాదవ్, అన్ని శాఖల అధికారులు, అన్ని గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు




