Thursday, 5 November 2026

తెరాస ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం

తెరాస ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దగ్ధం
బయ్యారం,అక్టోబర్27(జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు బయ్యారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ బయ్యారం మండలపార్టీ ప్రధాన కార్యదర్శి బత్తిని రామమూర్తి గౌడ్ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో అప్రజాస్వామిక చర్యలను వ్యతిరేకిస్తూ బిజెపి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను అప్రజాస్వామిక పద్ధతిలో బిజెపి ప్రభుత్వం డబ్బులు ఆశచూపి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 100 కోట్ల చొప్పున ఇస్తామని ఉన్నతమైన పదవులను కూడా ఇస్తామని మోసపూరితమైన మాటలు చెప్పి ఆ నలుగురు ఎమ్మెల్యేలను కొనుటకు ప్రయత్నం చేసినటువంటి బిజెపి నరేంద్ర మోడీ అమిత్ షా ల నీచమైన చర్యలను పటాపంచలు చేసినటువంటి ఆ నలుగురు ఎమ్మెల్యేలకు బయ్యారం మండల పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.మతవిద్వేషాలను రెచ్చగొడుతూ తెలంగాణలో పాగా వేయుటకు ప్రయత్నం చేస్తూ అప్రజాస్వామిక పద్ధతిలో వారి అనైతికతను చూపిస్తున్నటువంటి బిజెపి ని తెలంగాణలో బొంద పెట్టుటకు తెలంగాణ ప్రజలు ఏకం కావాలని,వారి యొక్క నీచ సంస్కృతిని కాల్చివేస్తూ దిష్టిబొమ్మను టిఆర్ఎస్ బయ్యారం మండల పార్టీ తరఫున దగ్ధం చేశారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, మండల పార్టీ ఉపాధ్యక్షులు తిరుమల ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి