Friday, 6 November 2026

తెరాస ఎమ్మెల్యేలు నాట్ ఫర్ సేల్: పత్తి లక్ష్మణ్

C

రుద్రూర్ (జనంసాక్షి):టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై టీఆర్‌ఎస్‌ నిరసనలతో హోరెత్తించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు బీజేపీ మరియు ప్రధాని మోదీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ నేపథ్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ తెరాస ఎమ్మెల్యేలు నాట్ ఫర్ సేల్ అని, తమ నాయకుడు సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా ఎదురుకోలేక ఇలాంటి పనులకు పాల్పడటం సిగ్గుపడాలి అని మండి పడ్డారు, బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ, బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్ , మాజీ విండో చైర్మన్ పత్తి రాము, నెరగంటి బాలరాజు, తొట్ల గంగారాం, కన్నెరవి, లాల్ మహమ్మద్, మొద్దుల నర్సయ్య, ఇతర కార్యకర్తలు ఉన్నారు