అహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన దేశంలోని మొట్ట మొదటి అండర్‌వాటర్ రెస్టారెంట్ ‘రియల్ పొసీడాన్’ మూతపడింది. స్థానిక అధికారుల నుంచి అనుమతి లేకుండా రెస్టారెంట్ సర్వీసులు ప్రారంభించారని గురువారం మున్సిపల్ అధికారులు రెస్టారెంట్‌ని సీజ్ చేశారు.
టౌన్ ప్లానింగ్ శాఖ నుంచి అవసరమైన అనుమతులేవీ తీసుకోకుండా యాజమాన్యం రెస్టారెంట్‌ని ప్రారంభించిందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ అనుమతులు తీసుకునేంత వరకు రెస్టారెంట్ సర్వీసులు ప్రారంభించకూడదంటూ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు.
లక్షన్నర లీటర్ల సామర్థ్యం ఉన్న పెద్ద అక్వేరియం నిర్మించి అందులో రకరకాల చేపలను వదిలారు. ఆ అక్వేరియం మధ్యలో గాజుగది నిర్మించి 32 సీట్లతో విలాసవంతమైన రెస్టారెంట్‌ని ఏర్పాటుచేసింది రియల్ పొసీడాన్ యాజమాన్యం. అయితే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులన్నీ పొందకపోవడంతో తెరచిన మూడు రోజులకే మూయాల్సి వచ్చింది.




