హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం చేసిన తొలి పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ అన్నారు. 1997లోనే తెలంగాణ కోసం తాము తీర్మానం చేశామన్నారు. ఆనాడు బిజెపి మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా అని అన్నారు. బిజెపి చొరవ తీసుకుని తెలంగాణకు మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నాలుగేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ధ్వజమెత్తారు. మోదీ హవాను తట్టుకోలేమనే టీఆర్‌ఎస్ ముందస్తుకు వెళ్లిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష ¬దా కూడా దక్కలేదని చెప్పారు. ఈ సారి ఈ రెండు పార్టీలకు భంగాపటు తప్పదన్నారు.
తెలంగాణకు ముందస్తు మద్దతు బిజెపిదే: రాం మాధవ్




