Tuesday, 3 November 2026

తెలంగాణకు రూ.2500 కోట్ల పెట్టుబడులు

5
అబుదబీలో లులు ఛైర్మన్‌తో కేటీఆర్‌ భేటి

సెంట్రల్‌ జైళ్ళను సందర్శించిన మంత్రి కేటీఆర్‌

్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జనంసాక్షి): తెలంగాణలో వచ్చే ఏడాది కాలంలో రూ. 2500 కోట్ల  పెట్టుబడి పెట్టేందుకు దుబాయ్‌కి చెందిన లులు గ్రూప్‌ కంపెనీ ముందుకొచ్చింది. దుబాయ్‌ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌, అధికారుల బృందం సోమవారం లులు గ్రూఫ్‌ చైర్మన్‌ యుసుఫ్‌ అలీని కలిసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి యుసుఫ్‌ అలీని కోరారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక పాలసీని మంత్రి వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను పరిశ్రమల కవిూషనర్‌ జయేష్‌ రంజన్‌, లులు పారిశ్రామిక బృందానికి వివరించారు.. హైదరాబాద్‌లో మూడు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ కంపెనీ సంసిద్ధత వ్యక్తంచేసింది. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌ యూనిట్‌, సవిూకృత మాంసం ప్రాసెసింగ్‌ యూనిట్‌, ఆధునిక షాపింగ్‌ మాల్‌ను ఏర్పాటు చేస్తామని వారు చెప్పారు. మూడు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ప్రభుత్వం ముందు ఉంచేందుకు జనవరి మొదట్లో హైదరాబాద్‌కు తమ ప్రతినిధి బృందం వస్తుందని యూసుఫ్‌ అలీ, మంత్రి కేటీఆర్‌ కు తెలిపారు. మరోవైపు  తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బృందం దుబాయ్‌లోని సెంట్రల్‌జైలును సందర్శించింది. దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్‌లో తెలుగు తెలిసిన వాళ్లు వుండేలా చూస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు. భారత్‌ నుంచి వచ్చే వలస కార్మికుల సమస్య పరిష్కారానికి కొత్త విధానాన్ని తీసుకువస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *