సూర్యాపేట ప్రతినిధి, జనవరి 26 ( జనంసాక్షి ):జిల్లా కేంద్రంలోని మహిత ఇండేన్ గ్యాస్ సర్వీసెస్ ఆధ్వర్యంలో గురువారం రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోట శ్యామ్ ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.స్వాతంత్య్ర సమరయోధులు చేసిన త్యాగాలను స్మరించుకొని,వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు.మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యములు ఎందరో సమరయోధుల ఆత్మార్పణ ఫలమన్నారు.భిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శించడమే మన దేశం యెక్క గొప్పతనమని అన్నారు.ఈ కార్యక్రమంలో తోట కమల , నీలిమ , నాగరాజు , సింగిరికొండ రవీందర్, బిక్కుమల్ల కృష్ణ , బిక్కుమల్ల లక్ష్మణ్, కలకోట్ల లక్ష్మయ్య, నాగరాజు , సిబ్బంది, హమాలీలు, గోదాం ఇన్చార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.




