తెలంగాణలో కొత్తగా 1539 కరోనా కేసులు
హైదరాబాద్,నవంబరు 5 (జనంసాక్షి): తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. 1500లకు పైగానే కేసులు నమోదవుతుండటం కాస్త ఆందోళన రేకిత్తిస్తోంది. అయితే పరీక్షల సంఖ్య పెంచడం కూడా కారణం కావొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,539 మందికి పాజిటివ్ తేలింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,45,862కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,362కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 978 మంది కోలుకోగా..ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,25,664కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18,656 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 15,864 మంది ¬ం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 285 కేసులు నమోదయ్యాయి.