ఈరోజు జగిత్యాల్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ భాష తర్వాత సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ తో కలిసి అమరుల వీరుల శంకుస్థాపన ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం తెలంగాణ యుద్ధం లో వీరమరణం పొందిన వారికి శ్రద్ధాంజలి కట్టించారు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి శ్రీ కొప్పుల ఈశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలంగాణ , జగిత్యాల లో అమలవుతున్న అభివృధి, సంక్షేమ కార్యక్రమా ల ప్రగతిని వివరించారు.
ఈ కార్యక్రమంలో .. జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంత ,ఎమ్మెల్యేలు డా సంజయ్ కుమార్ కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు జిల్లా ఎస్పీ భాస్కర్ ,అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత ,మంద మకరంద్ ,గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా.చంద్రశేఖర్ గౌడ్,DCMS చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది,ప్రజా ప్రతినిధులు తదితరల పాల్గొన్నారు.




