Wednesday, 4 November 2026

భవిత కేంద్రంలో అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం

భవిత కేంద్రంలో అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవం

టేకులపల్లి, డిసెంబర్ 3( జనం సాక్షి): టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉన్నటువంటి భవిత కేంద్రంలో అంతర్జాతీయ ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలను మండల కోఆర్డినేటర్ జాటోత్ రవీంద్రబాబు, నిరోజా శారని ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ సమాజంలో ప్రత్యేక ప్రతిభావంతులను చిన్నచూపు చూడకూడదని దివ్యాంగ పిల్లలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని విభిన్న ప్రతిభావంతుల్లో దాగివున్న ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించాలని అన్నారు. అనంతరం జి హెచ్ ఎస్ టేకులపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బద్రు మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదని ప్రతిభావంతులను అందరిలో సమానంగా చూడాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు, పిల్లలకు ముగ్గుల పోటీలు, రన్నింగ్, మ్యూజికల్ చైర్స్ ఆటలతో గెలుపొందిన విద్యార్థులకు ఎంఈఓ చేతులమీదుగా బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బానోతు లక్ష్మ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు.