చేవెళ్ల జూన్ 22(జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని స్థానిక సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి గారు తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గురువారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో అమరవీరుల స్థూపం చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది తమ జీవితాలనే త్యాగం చేసిన అమరవీరులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగి యాదయ్య, టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, ఈరమొల్ల మల్లేష్, మల్గారి మల్లారెడ్డి, శ్రీనివాస్ కోఆప్షన్ సభ్యులు పాటి దామోదర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మధ్యల శ్రీనివాస్, సుశాంత్, పంచాయితీ సెక్రెటరీ, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్స్, సీనియర్ నాయకులు, అతెల్లి రవీందర్ రెడ్డి, మల్గారి మల్లా రెడ్డి, యూత్ నాయకులు, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన చేవెళ్ల గ్రామ పంచాయతీ పాలకవర్గం..




