Wednesday, 4 November 2026

వ్యవసాయ అధికారుల నామమాత్రపు తనిఖీలు

బిచ్కుంద జూన్ 22 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్ర వ్యవసాయ అధికారులు శుక్రవారం నాడు ఎప్పటిలాగే నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం నాడు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో పోచయ్య మాట్లాడుతూ ప్రతి డీలర్ లైసెన్స్ కాపీ స్టాక్ బోర్డ్, బిల్ బుక్, పిసి లు తప్పకుండా ఉండాలని తెలియజేశారు. అలాగే రైతులకు ఏది అమ్మిన రసీదు తప్పకుండా ఇవ్వాలి అని సూచించారు. రైతులు లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలని బయట రాష్ట్రం విత్తనాలు తీసుకొని చెయ్యకూడదని అలాంటి విత్తనాలతో మోసపోవద్దని సూచించడం జరిగింది.