భైంసా రూరల్ మే28 జనం సాక్షితెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుగబోతున్న సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసా లో అమరులైన రెండు కుటుంబాలకు ప్రభుత్వం గతంలో ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని వెంటనే మంజూరు చేసి వారికుటుంబాలను ఆదుకోవాలని,అలాగే తెలంగాణా రాష్ట్ర సాధనలో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమ కారులను, పాటలతో,డప్పుల మోతలతో ఉద్యమానికి ఊపిరిలూదిన కవులు, కళాకారులను , ఆమరణ నిరహార దీక్షలు చేసినవారిని, ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మీడియా మిత్రులను ,ధర్నాల్లో పాల్గొన్న వారిని , పోలీస్ కేసుల్లో ఉన్నవారిని, తహసీల్దార్ వద్ద బైండోవర్ అయిన ఉద్యమకారులను గుర్తించి ఈ ఉత్సవాల్లో భాగంగా వారికి తగిన భాగస్వామ్యం కల్పించి, ప్రోత్సాహం ఇవ్వ వలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు .గౌరవ జిల్లా మంత్రివర్యులు , జిల్లా శాసన సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని త్వరలో జరిగే గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్మల్ పర్యటనలో ప్రకటింప చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ ఛైర్మన్ కొట్టే శేకర్ మరియు
నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు డా.ముష్కం రామకృష్ణాగౌడ్ కోరారు.




