భువనగిరి టౌన్( జనం సాక్షి ):– తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా గ్రామపంచాయతీ దగ్గర మరియు ప్రాథమిక పాఠశాల ఆవరణలో వడపర్తి గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి జెండా ఆవిష్కరించడం జరిగింది పై కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మరియు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మన ఆస్తిత్వాన్ని గుర్తు చేసుకుంటూ మరియు ఎందరో త్యాగాలు మరియు అమరవీరులను గుర్తిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని గుర్తు చేయడం జరిగింది పై కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డ్ సభ్యులు పంచాయతీ కార్యదర్శి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జెండా ఎగరవేసిన కృష్ణారెడ్డి..




