బోయినపల్లి జూన్ 02 (జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు బోయినపల్లి మండల కేంద్రం తో పాటు ఆయా గ్రామాల్లో ఘనంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ మహేందర్ ,రెవెన్యూ కార్యాలయంలో తాసిల్దారు నరేష్ , మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి పర్లపల్లి వేణుగోపాల్,మార్కెట్ యార్డు లో మార్కెట్ కమిటీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, రైతు వేదిక లో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొనుకటి లచ్చిరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ వద్ద పార్టీ మండల శాఖ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్ కొట్టేపల్లి సుధాకర్,బోయినపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గుంటి లతాశ్రీ,మండల విద్య వనరుల కేంద్రం లో విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు,జాతీయ జెండాలను ఎగురవేశారు,ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కత్తెరపాక ఉమ కొండయ్య,వైస్ ఎంపిపి కొనుకటి నాగయ్య,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, కో ఆప్షన్ అజ్జు ,ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి,ఆయా గ్రామాల సర్పంచ్ లు ఎంపిటిసిలు నాయకులు వివిధ సంఘాల నాయకులు ఉన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.




