Wednesday, 4 November 2026

తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది “కాంగ్రెస్”… బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వల్లే పదవులు

మిర్యాలగూడ, జనం సాక్షితెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వల్లే పదవులు అనుభవిస్తున్నారని మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మనబోయిన అర్జున్ లు అన్నారు. శనివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు అసమర్థులని, స్థానిక సమస్యలు, మంత్రుల దృష్టికి తీసుకువెళ్లలేదని కనీసం ప్రస్తావించలేదని విమర్శించారు. ప్రజలకు కావలసిన అవసరాల గురించి సభలో మాట్లాడడం మర్చిపోయారని బూటకపు మాటలతో సభ నిర్వహించారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు. ఎన్నికల సమయంలో జిమ్మిక్కులకు పాల్పడకుండా అభివృద్ధి కోసం పాటుపడాలని వారు సూచించారు. మున్సిపల్ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి, రామకృష్ణ తోపాటు నల్గొండ డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సిద్దు నాయక్, కుంజా శ్రీను, తదితరులు పాల్గొన్నారు.