రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 28.(జనంసాక్షి). నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతికి ఆహ్వానం పలకక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆదివారం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. రాజదండం వద్దురా రాజ్యాంగ ముద్దు రా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు పంతం రవి, కడారి రాములు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని చాటి చెప్పాల్సిన ప్రధాని మన ధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తూన్నట్లు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ఆదివాసి కావడంతో ఆహ్వానం పలక లేదని మండిపడ్డారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు తీరు ప్రజలు అర్థం చేసుకొని తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నిరసన కార్యక్రమంలో వడ్డేపల్లి లక్ష్మణ్, అజ్జు, మంచికట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.




