తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

ముస్తాబాద్ జూన్ 2 జనం సాక్షి
ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాల్ రెడ్డి  ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర  ప్రదాత తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.1200 అమరుల త్యాగాలను గుర్తించి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ  ఉనికిని కోల్పోతున్నామని తెలిసి కూడా అమరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈ రాష్ట్రాన్ని కెసిఆర్ రాబందుల రజాకార్ల రాష్ట్రంగా తయారు చేయడం జరిగింది.ఒకవైపు బంగారు తెలంగాణ అని బూటకపు మాటలు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆ నలుగురు చేతిలో కీలుబొమ్మగా మార్చడం జరిగింది.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో సబ్బండ వర్గాల ప్రజలు రాష్ట్ర సాధనలో ముందుకు రావడం జరిగింది తప్ప కెసిఆర్ దొంగ దీక్ష పట్టి  సాధించింది ఏమీ లేదు .వచ్చే 2023 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎర్ర కోట పైన కాంగ్రెస్ జెండాను  ఎగర వేస్తామని, కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎలక్షన్లలో ప్రజలందరూ మద్దతుగా నిలబడి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి , పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ,సీనియర్ నాయకులు కొండం రాజు రెడ్డి , ఆరుట్ల మహేష్ రెడ్డి, ఉచ్చిడి బాల్రెడ్డి ,వేలముల రామ్ రెడ్డి, వేముల సత్యం గౌడ్, మాదాసు అనిల్,రంజాన్ నరేష్,తాళ్ళ విజయ్, ఆగుల్ల రాజేశం,కొమురయ్య యాదవ్, మామిళ్ల ఆంజనేయులు,డాకురి మహేందర్,తదితరులు పాల్గొన్నారు.