సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2023 సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ డైరెక్టర్ కట్ట వెంకట్ రెడ్డి కొండమల్లేపల్లి డిసెంబర్ 24 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2023 వ సంవత్సర నూతన క్యాలెండర్ ను విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఆవిష్కరించారు 2023 వ సంవత్సర నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం, హర్షం వ్యక్తం చేశారు ఎంతో ప్రతిష్టాత్మకమైన నూతన క్యాలెండర్ ను మాచే ఆవిష్కరించడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొన్నారు సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ కట్ట వెంకటరెడ్డి మాట్లాడుతూ తరాలు మారుతున్న తరగని స్ఫూర్తితో యువతను ఆదర్శ భావాలు వైపు నడిపించేలా మా పాఠశాలలో తీర్చిదిద్దుతామని 2023 నూతన సంవత్సరం ఉత్తేజంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు నూతన వరవడితో కొత్త సంవత్సరంలో మంచి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కలలను నెరవేర్చాలని ఆకాంక్షించారు మరియు సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ సంస్కృతి పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎంతో తెలివిగలవారని, క్రమశిక్షణ, సమయపాలనకు మారుపేరని,ఆంగ్ల భాషలో మంచిపట్టున్న ఉపాధ్యాయులచే బోధించడం పట్ల పిల్లలు ఆసక్తిగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో సైనిక్, గురుకుల, ఐఐటి, నవోదయ పోటీ పరీక్షలో నెగ్గడం కోసం నాణ్యమైన విద్యతో పాటు మంచి కోచింగ్ ఇప్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు సంస్కృత ఇంగ్లీష్ మీడియం పాఠశాల మేనేజ్మెంట్ ను కోరారు ఈ కార్యక్రమంలో సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ కట్ట వెంకటరెడ్డి, ప్రిన్సిపాల్ సుదర్శన్ రెడ్డి, కరస్పాండెంట్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
సంస్కృతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2023 సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ




