Wednesday, 4 November 2026

రక్తహీనతను గుర్తించి పిల్లలకు,గర్భిణీ లకు సరైన సమయంలో మందులు ఇచ్చి రక్తహీనత నుండి కాపాడాలి

నాగర్ కర్నూల్ ఆర్సీ మే 23(జనంసాక్షి):మంగళవారం మధ్యాహ్నం పాలెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలోకలెక్టర్సమీక్షనిర్వహించారు.రక్తహీనత,పిల్లలకు టీకాలు,కంటివెలుగు,ఆర్.బి.ఎస్.కే సేవలు,102వాహన సేవలు పై సమీక్ష నిర్వహించారు.పిల్లలకు ఇవ్వాల్సిన టీకాలు అన్ని సక్రమంగా ఎది తప్పిపోకుండ చూడాల్సిన బాధ్యత ఎ.ఎన్.యం.ఆశాల పై ఉంటుందన్నారు.ఏ ఒక్క టీకా మర్చి పోయిన ఆ పిల్లాడికి అన్యాయం చేసినవారు అవుతారు అన్నారు.అదేవిధంగా పిల్లలు,గర్భిణీలు చాలా మంది రక్త హీనతతో బాధపడుతుంటారు.వారిని గుర్తించి సరైన వైద్యం,ఫోలిక్ యాసిడ్ మాత్రలు ఇచ్చి క్రమం తప్పకుండా తినిపించ గలిగినప్పుడే రక్తహీనత తో కాపాడినవారవుతరని తెలిపారు.ఆర్.బి.ఎస్.కే వారు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉండాలని సూచించారు.”కంటివేలుగు” కార్యక్రమం ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాలో 24వేల మంది కాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించడం జరిగిందని,వీరందరినీ ఒక ప్రణాళిక,గడువులోగా శస్త్ర చికిత్స చేయించాలని సూచించారు.ఇందుకు కంతివెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ ను ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు.ముందు ఒక మండలాన్ని ఎంచుకొని అందులో గుర్తించిన కంటి సమస్య రోగులకు ప్రణాళిక ప్రకారం శస్త్ర చికిత్స చేయించి కంటి సమస్యలు లేని మండలంగా ప్రకటించాలన్నారు.తర్వాత మిగిలిన మండలాలు చేపట్టి కంటి సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని తెలిపారు.జిల్లాలో గర్భిలను పరీక్షల నిమిత్తం,ప్రసవాలకు తరలించడానికి ప్రభుత్వం 102 వాహనాలు ఇవ్వడం జరిగిందన్నారు.జిల్లాలో మొత్తం 14వాహనాలు ఉండగా వాటిని గర్భిణీలు సరిగ్గా వినియోగించుకోవడం లేదన్నారు.ఆశా వర్కర్లు,ఎ.ఎన్.యం లు వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలన్నారు.గర్భిణీలు ప్రసవానికి గానీ టీకా లకు వచ్చినప్పుడు 102ఉచిత వాహనంలో నే తరలించాలని సూచించారు.ప్రాథమిక ఆరోగ్య అధికారులు తన కిందిస్థాయి సిబ్బంది పై సరైన పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.అనంతరం వ్యాక్సిన్ నిల్వ ఉంచే గదిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.సుధాకర్ లాల్,ఇమ్యునైజేశన్ అధికారి రవినాయక్,డిప్యూటీ డి.యం.హెచ్.ఒ వెంకట దాస్,ప్రోగ్రాం ఆఫీసర్ రెనయ్య, మెడికల్ ఆఫీసర్లు,మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు,ఆర్.బి.ఎస్.కే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.