Wednesday, 4 November 2026

తెలంగాణ ఏర్పాటు కోరుతూ ఉపాధ్యాయుల ర్యాలీ

కరీంనగర్‌, అక్టోబర్‌ 16 (ఎపిఇఎంఎస్‌): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ హుజూరాబాద్‌  పట్టణంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయ నేతలు మంగళవారం ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని  ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. తెలంగాణప్రాంతంలో ఎందరో నిరుద్యోగులు ఉన్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వారికి ఉద్యోగావకాశాలు వస్తాయి తప్ప సమైక్యరాష్ట్రంలో రావని వారు అన్నారు. సీమాంధ్రులకు ఉద్యోగాలు 80శాతం కల్పిస్తూ, తెలంగాణ ప్రాంతం వారికి 15శాతం మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్నారని ఇది తగదని వారు డిమాండ్‌ చేశారు. వెంటనే కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *