Wednesday, 4 November 2026

తెలంగాణ కెసిఆర్ హయాంలో సర్వముకాభివృద్ధిఅన్ని వర్గాలకు సమన్యాయం మహిళలకు పెద్దపీట కేసీఆర్ సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం

 

 

 

 

 

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఏప్రిల్ 25 :తెలంగాణ కెసిఆర్ ముఖ్యమంత్రి హాయంలో సర్వ సర్వముఖాభివృద్ధి చెందిందని ఆయన హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుసంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే , హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.  కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అయ్యి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభ మంగళవారం సంగారెడ్డి పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్ లో రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ను దేశంలోనే టాప్ లో నిలిపామన్నారు. మహారాష్ట్రలో రైతులు కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బిజెపిలను తప్పకుండా ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఓడిస్తారని అన్నారు. కెసిఆర్ కాలిగోటికి సరిపోయే నాయకుడు ఎవరూ లేరని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలవారు సంతోషంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వలన అందరూ సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 4 వేల మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సభలో దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సమావేశం సందర్భంగా బీఅర్ఎస్ పార్టీ జెండాను తన క్యాంప్ కార్యాలయంలో ఎగురవేసిన చింతా ప్రభాకర్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పట్నం మాణిక్యం, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, మందుల వరలక్ష్మి, మాజీ సిడిసి ఛైర్మెన్ విజేందర్ రెడ్డి, పట్టణ కార్యదర్శి నర్సింలు, సదాశివపేట, కొండాపూర్, సంగారెడ్డి, కంది మండలాల అధ్యక్షులు పెద్దగోల ఆంజనేయులు, విఠల్, చక్రపాణి మధుసూదన్ రెడ్డి, నియోజకవర్గం వ్యాప్తంగా జడ్పిటిసిలు, ఎంపిటిసిలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.