ధర్మపురి 25 ఏప్రిల్ (జనం సాక్షి ) ధర్మపురి పట్టంలోని స్థానిక కర్నే అక్కపెల్లి కళ్యాణ మంటపంలో మంగళవారం సాయంత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షుడు గుమ్మడి కుమార స్వామి గోదావరిఖని అధ్యర్యంలో ప్రజాహిత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫి, నిరుద్యోగ యువతకు ప్రతి నెల రూ.3016 చొప్పున ఇస్తానన్న నిరుద్యోగ భృతి పై ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువచ్చి రైతాంగానికి, యువతకు మేలు చేయాలని సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ప్రజాహిత కార్యక్రమంలో భాగంగా రైతు రుణమాఫి, నోదరుద్యోగ భృతిపై దరఖాస్తుల ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గంలోని రైతులు, యువత, వివిధ ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున దరఖాస్తుల ఉద్యమం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి పై ప్రజల నుండి స్వీకరించిన ధరఖాస్తులను రాష్ట్ర గవర్నర్ కు, ముఖ్యమంత్రి కి, జిల్లా కలెక్టర్ల కు, మండల అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ ధరఖాస్తుల ఉద్యమం ద్వారా అయిన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని రైతాంగానికి నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, యువత శ్రేయస్సు కోసం చేపట్టిన ఈ ధరఖాస్తుల ఉద్యమంలో రైతాంగం,యువత పెద్ద ఎత్తున పాల్గొని ధరఖాస్తులు సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు బొల్లి స్వామి పెద్దపెల్లి, కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల స్వామి పెగడపెల్లి,సామాజిక కార్యకర్త మోతె నరేష్, స్థానిక రైతులు, యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.




