తెలంగాణ చదువులకు చంద్రగ్రహణం
ట్విట్టర్ ద్వారా రేవంత్ విమర్శలు
హైదరాబాద్,జూలై13(జనంసాక్షి): తెలంగాణలో పేద పిల్లల చదువుకు ’చంద్ర’గ్రహణం పట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శించారు. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారం లోకి వెళ్లడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో పేద పిల్లల చదువులకు ’చంద్ర’గ్రహణం పట్టింది. ఉపాధ్యాయులు లేక, పాఠ్యపుస్తకాలు లేక పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ’మన ఊరు ` మన బడి’ ఓ ప్రచారార్భాటం. ప్రశ్నించకపోతే తెలంగాణ అజ్ఞానాంధకారంలోకి వెళ్లడం ఖాయం‘ అని రేవంత్ ట్వీట్లో పేర్కొన్నారు.