భువనగిరి టౌన్ జనం సాక్షి:–
భువనగిరి జూన్ / 15 : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలో గురువారం రోజు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గ్రామ సర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ బొడ్రాయి సెంటర్ నుండి వ్యాయామశాల మీదుగా గ్రంథాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామ శివారులో గల నర్సరీ , పల్లె ప్రకృతి వనంలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ నర్సరీలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నామని , పంచాయతీ కార్యాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు నీళ్లు పట్టడం అలాగే హరిత వనంలో కూడా చెట్లకు నీళ్లు పోయడం వలన మొక్కలు దృఢంగా ఉన్నాయన్నారు. అంతకుముందు గ్రామ నూతన పంచాయతీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించి , గీతా లాపాన చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన గ్రామసభను నిర్వహించి గ్రామంలో ఐదు సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి పనులను పంచాయతీ కార్యదర్శి ఆమని పాలకవర్గ సభ్యులకు , గ్రామస్తులకు వివరిస్తూ పలు తీర్మానాలు చేసుకోవడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యాలయ సిబ్బందికి నూతన బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తోపాటు ఉప సర్పంచ్ నీల పోశెట్టి గౌడ్ , వార్డు సభ్యులు చుక్కల కమలమ్మ , పబ్బాల రమేష్ , కోట పోచయ్య, కో ఆప్షన్ సభ్యులు కళ్లెం కృష్ణ గౌడ్ , కోట స్వామి దాస్, ఎశబోయిన లక్ష్మి , నీటి పారుదల ఏఈ భరత్ కుమార్ , ఫీల్డ్ అసిస్టెంట్ బబ్బూరి శంకర్ గౌడ్, బిఆర్ఎస్ మండల కమిటీ ఉపాధ్యాయుడు చుక్కల శంకర్ యాదవ్, బిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి జక్కుల చంద్రయ్య యాదవ్, బిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు నీల భారతమ్మ, బిఆర్ఎస్ నాయకులు బబ్బూరి పోశెట్టి గౌడ్, చుక్కల మల్లయ్య యాదవ్, గుండు రవి గౌడ్ , నోముల నరసింహ యాదవ్ (సిఇఓ) , కోట లక్మయ్య, ఆశా వర్కర్లు , హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్లు , అంగన్వాడీ టీచర్లు , కరెంటు లైన్ మెన్ , గ్రామపంచాయతీ కార్యదర్శి ఆమని , గ్రామస్తులు పాల్గొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని వడాయిగూడెంలో ర్యాలీసర్పంచ్ గుండు మనీష్ గౌడ్ ప్రగతి నివేదన.




