భువనగిరి ఆర్ సి( జనం సాక్షి ):–భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలోని భువనగిరి పట్టణంలోని రాయగిరి రైతులను కలిసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ..ట్రిపుల్ ఆర్ భూముల అంశంలో పోరాటం చేస్తూ జైలుకు వెళ్లొచ్చిన రాయగిరి రైతులను కలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.జైలుకు వెళ్లిన రైతులందరికీ భూములు ఉన్నాయి.- డీసీపీ వెంటనే రాయగిరి రైతులకు క్షమాపణ చెప్పాలి.- ఐపీఎస్ చదువుకున్నావా.. ఇదేనా నీ జ్ఞానం..- ప్రభుత్వం చెప్పినట్టు డీసీపీ నడుచుకోవడం కరెక్ట్ కాదు.
– అధికార పార్టీ నాయకులు రేపటి నుంచి ఈ ప్రాంతంలో ఎలా తిరుగుతారో చూస్తా.- భూ సేకరణ అంశం కేంద్రానికి సంబంధించింది కాదని కేంద్ర రవాణా శాఖ మంత్రి చెప్పారు.- ట్రిపుల్ ఆర్ భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది.
– రాయగిరి రైతులకు సంకెళ్లు వేయడంతో రాష్ట్రంలో అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.- పోలీస్ అధికారులు ప్రభుత్వ మాటలు వినకండి.. కేసీఆర్ ప్రభుత్వం ఉండేది ఇంకా ఆరు నెలలు మాత్రమే.- డీసీపీ వెంటనే తన స్టేట్మెంట్ ని వెనక్కి తీసుకోవాలి.- ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో గెలిచేవాడు లేడు.. ఈ ప్రభుత్వం మళ్లీ వచ్చేది లేదు.- పోయేకాలం వచ్చింది కాబట్టే ఓఆర్ఆర్ అమ్మారు.- ఓఆర్ఆర్ ఇష్యూలో లక్షల కోట్ల స్కాం చేశారు కేసీఆర్.- ఓఆర్ఆర్ అమ్మడం అంటే.. దివాలా తీసినట్టే.. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పంజాలరామాంజనేయులు గౌడ్ ఆలేరు ఇంచార్జ్ బీర్ల ఐలయ్య పోతునకు ప్రమోద్ కుమార్ బర్రె జహంగీర్ ఎలిమినేటి కృష్ణారెడ్డి పిట్టల బాలరాజ్ ,పల్లెల యాదగిరి బబ్లు జిట్ట మల్లారెడ్డి నవీన్ సుధాకర్ అమానతుల్లా, తదితరులు పాల్గొన్నారు.
రైతులు కాదు అని వాక్యాలను వెనక్కు తీసుకోవాలి డిసిపి .




