Tuesday, 3 November 2026

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు గ్రామ గ్రామాన పండగ వాతావరణం లో నిర్వహించాలని ఎంపీపీ మంజుల జెడ్పిటిసి మేఘమాల

 

జనం సాక్షి / కొల్చారం ఎంపీడీవో కార్యాలయంలో నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు, జూన్ రెండో తేదీ నుండి 20 రోజుల పాటు గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని వారు తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని ఈ సందర్భంగా వారు తెలిపారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలిసే విధంగా గ్రామ గ్రామాన దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోఎంపీపీ మంజుల కాశీనాథ్. జెడ్పిటిసి మేఘమాల సంతోష్. ఎంపీడీవో గణేష్ రెడ్డి .ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్. ఎమ్మార్వో చంద్రశేఖర రావు. ఏపీవో మైపాల్ రెడ్డి ఎంపీ ఓ కృష్ణవేణి. ఐకెపి . అగ్రికల్చర్ ఏవో శ్వేత కుమారి. గ్రామ పంచాయతీ సెక్రెటరీ అరుంధతి మహేష్ ఆంజనేయులు స్వాతి ప్రియా మౌనిక మమత సదాశివుడు ప్రవీణ్ ప్రియాంక నాగరత్నం నగేష్ రాజేందర్ సంతోష్ ని సౌజన్య తదితరులు పాల్గొన్నారు