హుజూర్ నగర్ జూన్10 (జనంసాక్షి): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని జూన్ 14న ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ నిరంజన్ కోరారు. శనివారం పట్టణంలోని ఏరియా హాస్పిటల్ నందు ఏర్పాటైన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఆరోగ్య దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంతోపాటు ఏడు నుంచి తొమ్మిది నెలలోపు గర్భిణీ స్త్రీలకు పోషక విలువలతో కూడిన కిట్లను, ఏ. యన్.ఎం, ఆశాలకు యూనిఫాంలు పంపిణీ, విశిష్ట సేవలు అందించిన ఉద్యోగులకు ఉత్తమ సేవా పురస్కారాలను అందించనున్నట్లు తెలిపారు. పీహెచ్సీల వైద్యాధికారులు వైద్య రంగంలో సాధించిన ప్రగతిని కరపత్రాలు ద్వారా క్షేత్రస్థాయిలో తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సాహితీ, ఏరియా హాస్పిటల్ సూపరిన్డెంట్ డాక్టర్ కరుణ్ కుమార్, మండల వైద్యాధికారులు డాక్టర్ సన, సుధాకర్ నాయక్, నాగిని, వేణుగోపాల్, నరేష్, జగదీశ్వర్, వివిధ ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి – డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ ఎండీ. నిరంజన్




