వీణవంక మే 30(జనం సాక్షి) వీణవంక మండలం లోని స్థానిక మండల పరిషత్ కార్యాలయములో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రోజున తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు కార్యక్రమాల సన్నాహక సమావేశము నిర్వహించారు అనంతరం
దశాబ్ది ఉత్సవాలు లలో భాగం గా వచ్చే నెల 3 వ తేదిన జరిగే రైతు దినోత్సవ సందర్భంగా మండలం లోని 5 క్లస్టర్ లలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకొని ఇట్టి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని, వచ్చేనెల 8 వ తారిఖున మండలంలో ఊరూరా చెరువుల పండుగ లో భాగంగా ప్రతి గ్రామాన చెరువు గట్టు పైన మైసమ్మ గుడి వద్ద మహిలలోతో బోనాలు బతుకమ్మలు ఆటా పాటలతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించచుకోవాలని వచ్చే నెల,22 వ తేదీ వరకు తెలంగాణ ఆవిర్భావం కోసం అమరులైన అమరవీరుల శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పాట ప్లే చేయడం మరియు అమరవీరుల స్తూపం ఉంటే స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించడం లేదా వాటి వద్ద శ్రద్ధాంజలి ఘటించాలని తెలిపారు అలాగే మీటింగ్ నిర్వహించి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని తీర్మానం చేయాలని చెప్పారు
పల్లె ప్రగతి దినోత్సవం లో భాగంగా
1. రైతు దినోత్సవం
2. పల్లె ప్రగతి సాధించిన విజయాలు పనులు
2. మిషన్ భగీరథ
3. పెన్షన్లు
4. చెరువుల పండుగ
5. మహిళా సంక్షేమం
6. హరితాహారం తదితర కార్యక్రమాలు రైతులు అందరూ రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసే సమావేశంలో
మండల సర్పంచులు ఎంపీటీసి లు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అందరు మండల గ్రామ స్థాయి అధికారులు అందరూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని విజయవంతం చేయాలి అని తెలియజేశారు.
ఈ కార్యక్రమములో మండల అభివృద్ధి అధికారి కె ప్రభాకర్ అన్ని క్లస్టర్ ల ఏఈఓ లు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, తో పాటు తదితరులు పాల్గొన్నారు.




