తెలంగాణ ద్రోహి తెలుసుకో ఆంధ్ర నాయకుల కొమ్ము కాయడం మానుకో*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 23, జనంసాక్షి :
ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటూ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నాడని జిల్లా కలెక్టర్ రవికి, వైయస్సార్ టిపి అధ్యక్షులు చెదలు సత్యనారాయణ ఫిర్యాదు చేయడంపై స్పందించిన బిఆర్ఎస్ పార్టీ మెట్ పల్లి సీనియర్ నాయకులు స్పందిస్తూ వైయస్సార్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షుడా నీ ఇంటి పేరు లాగానే నీ బుర్ర కూడా చెదలు చెదలతో నిండిపోయిందా ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మానవతా దృక్పథంతో కొత్తగా పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు చీరే సారే అందించాలని ఉద్దేశ్యంతో తన సొంత ఖర్చులతో పసుపు కుంకుమ చీరను అందిస్తుంటే సంబంధిత అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్నారు నియోజకవర్గ ఆడబిడ్డలు తమ పెద్ద అన్న చేతుల మీదుగా అందుకోవాలని కోరిక మేరకు కార్యక్రమంలో పాల్గొంటున్నాడే తప్ప మీలాగా తెలంగాణ ద్రోహుల కొమ్ము కాయడం లేదు నాయకులు సంజయ్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు నియోజకవర్గంలో పలు పర్యాయాలు పేద ప్రజల కోసం ఎన్నోసార్లు హెల్త్ క్యాంపులు నిర్వహించాడు కరోనా సమయంలో తన సొంత ఖర్చులతో ప్రజలకు చదువుకునే విద్యార్థులకు వ్యాక్సిన్ కోసం రూపాయలు వెచ్చించి ఎంతోమందిని ఆరోగ్యా రిత్యా ఆదుకున్నాడు అలాగే నిరుద్యోగుల కొరకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉద్యోగ పరీక్షలకు వెళ్లేందుకు అన్ని రకాల సదుపాయాలు కల్పించిన ఘనత మా నాయకుడు సంజయ్ , అలాంటి నాయకున్ని విమర్శించడం మానుకొని బుద్ధిగా మసలుకోకపోతే తర్వాత జరిగే పరిణామాలకు నువ్వే బాధ్యుడవుతావు అని
హెచ్చరించారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మార్గం గంగాధర్, సీనియర్ నాయకులు లింగంపల్లి సంజీవ్, న్యాయవాది ఆకుల ప్రవీణ్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండ రాజేందర్, వాణిజ్య సెల్ నాయకులు మొరపు జలంధర్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ద్రోహి తెలుసుకో ఆంధ్ర నాయకుల కొమ్ము కాయడం మానుకో




