Friday, 6 November 2026

మహా రైతు ధర్నాకు తరలి వెళ్లిన ఎమ్మెల్యే మణిక్ రావు, బిఆర్ఎస్ నాయకులు

మహా రైతు ధర్నాకు తరలి వెళ్లిన ఎమ్మెల్యే మణిక్ రావు, బిఆర్ఎస్ నాయకులు

జహీరాబాద్ డిసెంబర్ 23 (జనం సాక్షి) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారక రామారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతు కల్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, ఈజీఎస్ నిధుల తిరిగి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహా రైతు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే మణిక్ రావు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో తరలి వెళ్ళారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, పెంట రెడ్డి విజయ కుమార్ బొగ్గుల సంగమేశ్వర్,బాస్కర్,వెంకటేశం, మోహినోద్దీన్, గుండప్ప బాబీ యూనిస్, తదితరులు ఉన్నారు