మహిళ మండలి విషయంలో రాజకీయలు చేయద్దు,
సుధాకర్ గౌడ్
రుద్రూర్(జనంసాక్షి): గత కొన్ని రోజులుగా మహిళా మండలి స్థలంలో నిర్మిస్తున్న గ్రంథాలయ పనులను ఆపాలని రుద్రూర్ గ్రామ పంచాయితీ వద్ద రిలే నిరాహారదీక్షలు చేస్తున్న మహిళ మండలి పై ప్రతీ పక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ శుక్రవారం రోజున బీజేపీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ
మహిళా మండలి స్థలంలో నిర్మిస్తున్న గ్రంథాలయ పనులను ఆపాలని, మహిళా మండలి స్థలాన్ని మహిళలకు దక్కే వరకు ఉద్యమిస్తామని , వివాదాస్పద గ్రంథాలయ స్థలం విషయంలో బీజేపీ నాయకులు మహిళా మండలి సభ్యులకు మద్దతుగా ఉంటే , మాకు వచ్చే ఆదరణకు తట్టుకోలేక మాపై బురద చల్లే వారికి రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మండి పడ్డారు. ఇప్పటికే మహిళలు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారని తొమ్మిది రోజుల నుంచి మహిళలు, గ్రామస్తులు రిలే దీక్షలు చేస్తున్న స్పందించని పాలకులు అధికారులు, ప్రజలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక,
బిజెపి పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జ్ మాల్యాద్రి రెడ్డి పై రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు, మహిళలకు ,గ్రామస్తులకు బిజెపి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. బిజెపి పార్టీ డబ్బుల కోసం పనిచేయదు సిద్ధాంతల కోసం, ప్రజల కోసం పనిచేస్తుందని మరోసారి గుర్తు చేశారు
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ , బిజెవైయం గణేశ్, తోట శంకర్, గాండ్ల సాయిలు మహిళ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




