హైదరాబాద్,అక్టోబర్19(జనంసాక్షి): రాష్ట్రంలో పార్టీని విస్తరించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని పార్టీ నేత కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. .. అందువల్ల తెలంగాణ ద్రోహులు, అవకాశవాదులతో కలవకుండానే పోటీలోకి దిగుతున్నామన్నారు. అసోం, త్రిపుర తరహాలోనే తెలంగాణలోనూ భాజపా అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసి.. తెలంగాణ అమరవీరులకు ద్రోహం చేస్తున్న తెరాసకు గట్టిగా బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాజపా చిత్తశుద్ధితో పనిచేసిందని, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు, గల్లీ నుంచి దిల్లీ వరకు తాము ఒకే మాట విూద నిలబడిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించినట్లుగానే.. తెలంగాణ అభివృద్ధిలోనూ ముందుంటామన్నారు. కాంగ్రెస్, తెరాస ప్రభుత్వాల వైఫల్యాలను గ్రామాల్లో
ఎండగడతామన్నారు. తెలంగాణలో మార్పు భాజపాతోనే సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఆశించిన ఫలితాలు వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వం: కిషన్ రెడ్డి




