ఆర్టీఐ రక్షక్ జిల్లా యూత్ అధ్యక్షుడు మేడి స్వామి మౌర్యఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 9 (జనంసాక్షి) యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుడూర్ మండలం చిర్రగుడూర్ గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ పాఠశాలను సందర్శించిన ఆర్టీఐ రక్షక్ యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ అధ్యక్షుడు మేడి స్వామి మౌర్య వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి అలాగే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం నోటీస్ బోర్డ్ లో పూర్తి సమాచారం విద్యార్థులకు అందించాలని అందరికి తెలిసేటట్టు తెలియజేయాలని ఆయన సూచించారు వారితో ఉపాధ్యాయులు ఆయాలు తదితరులు పాల్గొన్నారు




