Wednesday, 4 November 2026

తెలంగాణ ప్రజలందరూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అయితే రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు

 

 

 

 

 

 

 

రాజంపేట్ ఫిబ్రవరి 11 (జనంసాక్షి)కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో శనివారం ప్రజా గోస బిజెపి భరోసా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజంపేట్ మండల పరిధిలో 6 గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించిన కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నది..రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భారతదేశము అన్ని రంగాల్లో ముందుకు పోతుందని
భారతదేశాన్ని విశ్వగురువు గా నిలపడమే నరేంద్రమోదీ లక్ష్యమని అన్నారు కరోనా ను సమర్థవంతంగా ఎదుర్కొన్నది భారత్ మాత్రమే తెలంగాణ ప్రజలందరూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అయితే రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు
కరోనా సమయంలో ప్రపంచం అంతా అతలాకుతలం అయినా సమర్థవంతంగా ఎదుర్కొన్నది మాత్రం భారత్ మాత్రమే అని అన్నారు. కరోనా టీకాను 12 ఏళ్ల నుండి మొదలుకొని అందరికీ ఉచితంగా ఇచ్చిన ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిది అని అన్నారు. ఒక వైపు కేంద్రంలో సమర్థవంతమైన బీజేపి ప్రభుత్వం నడుస్తుంటే తెలంగాణ కల్వకుంట్ల కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. మొన్న అసెంబ్లీలో కుటుంబ పాలన గురించి మాట్లాడిన మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులే అని అన్నారని తెలంగాణ ప్రజలందరూ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు అయితే రైతు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నట్టు అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చనీ కెసిఆర్ ప్రభుత్వం దేశానికి ఏదో చేస్తాం అని బిఆర్ఎస్గా మారి ప్రజలను మద్యపెడుతుందని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగిన బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట్ మండల అధ్యక్షులు గంగారెడ్డి, శక్తి కేంద్రం ఇంఛార్జి లు పిట్ల శ్రీనివాస్, బక్కి సంధ్య, సంపత్ రెడ్డి, నాయకులు రమేష్, రాజు, దుర్గాప్రసాద్, సాయిబాబా, మనోహర్ రెడ్డి, చిన్న స్వామి బాల్ నర్స్ ప్రసాద్, సాయిరెడ్డి, రాము, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.