తెలంగాణ ప్రజలను మధుయాష్కి మోసం చేస్తున్నాడు
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాగౌడ్
నిజామాబాద్, జనవరి 31 (: తెలంగాణకు ద్రోహం చేసిన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మధుయాష్కిగౌడ్ వెంటనే రాజీనామా చేయాలని కోరుతూ గురువారం జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు దిష్టిబొమ్మను చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింబాగౌడ్ మాట్లాడుతూ తన పదవిని కాపాడుకోవడానికి మధుయాష్కిగౌడ్ తెలంగాణ డ్రామా ఆడుతున్నారని, ఆయనకు తెలంగాణపై ఏమాత్రం చిత్తశుద్ది లేదన్నారు. గల్లిలో ఓ మాట ఢిల్లీలో ఓ మాటా మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను మధుయాష్కిగౌడ్ మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అయన వైఖరీ నిజామాబాద్ జిల్లా ప్రజలను కాల్చివేసిందని, తక్షణమే రాజీనామా చేయకుంటే తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, సాయన్న, గంగరత్నం, ఆశానారాయణ, అశోక్ తదితరులున్నారు.
ఎబివిపి ఆద్వర్యంలో…నగరంలోని ధర్నాచౌక్ ఎదుట ఎబివిపి విద్యార్థులు గురువారం వినూత్న రీతిలో మధుయాష్కిని కొడుతున్నట్లు డ్రామావేసి, ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కార్యదర్శి అంజాగౌడ్ మాట్లాడుతూ మధుయాష్కిగౌడ్ తక్షణమే రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని, లేనిపక్షంలో జిల్లా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి విద్యార్థులు పాల్గొన్నారు.