తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తాం.
– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో లక్ష ఉద్యోగాలు.
– జీవన భృతి, ఆసరా పెన్షన్, వికలాంగ పెన్షన్,, డబుల్ చేస్తాం,
తెలంగాణను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది,
– తెలంగాణ సాధనలో రైతుల పాత్ర కూడా ఉంది,
– ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ,
కామారెడ్డి జనం సాక్షి ,;అక్టోబర్ 20
తెలంగాణ ప్రజల కోరికను నెరవేర్చింది కాంగ్రెస్సేనని, తెలంగాణ ప్రజల కళలను కూడా చేసేది కాంగ్రెసేనని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం జరిగిన ప్రజాగర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…….. తెలంగాణ ప్రజలు తమ కోరికలైనా నీళ్లు, నిధులు, నియామకాలు తమకు కావాలని దృఢనిశ్చయంతో 60 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడుతూ యువకులు సైతం తెలంగాణ కోసం త్యాగం చేయడంతో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అక్షరాలు సోనియాగాంధీ చెల్లించి తెలంగాణ యువకులు ఆత్మహత్య చేసుకోవద్దని వారి కోరికను నెరవేరుస్తానని 17 పార్టీలతో చర్చించి చర్చించి తర్వాత తెలంగాణను ఇచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు నెరవేరుస్తారని సాధించుకుంటామని, కేసీఆర్ ను నమ్మి అతడిని అధికారంలోకి తీసుకు వస్తే తెలంగాణ ప్రజలను పక్కకునెట్టి వాని మాత్రం పోషించుకుంటూ ఉన్నాడని నిధులు నియామకాలు ఉద్యోగాలు ఆ కుటుంబానికి సొంతమయ్యాయి అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని నాలుగు సంవత్సరాలలో చేయడంతో ఇప్పటికే రైతులకు రుణమాఫీ జరగలేదన్నారు. కెసిఆర్ ఇచ్చిన హామీలు అయినా దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, లక్ష ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ద్వారా లక్షల ఎకరాలకు నీరందించేందుకు అను ఇది వేల కోట్లతో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిజైన్ పేరుతో దాన్ని లక్ష రూపాయల కోట్లకు పెంచిందన్నారు. దేశంలోని ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నిటినో డిజైన్ పేరుతో కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఉద్యమ సమయంలో కెసిఆర్ గల్ఫ్ లో ఉన్న వారికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తామని చెప్పి ఇప్పటి వరకు వారి ఊసెత్తడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కోసం ప్రత్యేకంగా ఐదు వందల కోట్లను కేటాయించడం జరుగుతుందన్నారు. విదేశాలలో మరణించిన కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
బిజెపి టిఆర్ఎస్ ప్రణాళికలే ముందస్తు ఎన్నికలు.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు బిజెపి బిజెపి, టిఆర్ఎస్ ల ప్రణాళికలో భాగంగానే వండర్స్ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.. ముఖ్యంగా మైనారిటీలను మోసం చేయడానికే ఈ ముందస్తు ఎన్నికలు అని , పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టిఆర్ఎస్ పార్టీ పొత్తు ఒప్పందం రహస్యంగా జరిగిపోయిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కారం లోకి రాగానే అమలు చేస్తోందన్నారు. ఏ విధంగా మేం ఇస్తున్న వాగ్దానాలను సైతం అమలు చేసి తీరుతాం అన్నారు.
నోట్ల రద్దును వ్యతిరేకించని టిఆర్ఎస్ పార్టీ.,
దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ నోట్ల రద్దు చేస్తే మేధావులు ప్రజలు వ్యతిరేకిస్తే ఆర్ ఎస్ పార్టీ మాత్రం బీజేపీకి మద్దతు తెలిపిందన్నారు. నోట్ల రద్దు వల్ల దేశానికి ఒరిగిందేమీ లేదని, ఎన్నికల ప్రచారంలో మోడీ ఒక్కరే అకౌంట్లలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు రూపాయి కూడా జమ చేయలేదన్నారు.నీళ్ళు నిదులు నియామకాల కోసం ప్రజలు ఉద్యమించారు. తెలంగాణ స్పప్నాన్ని సాకారం చేసింది కాంగ్రెస్ పార్టీ..పోయిన ఎన్నికలలో ప్రజలు కేసిఆర్ పై నమ్మకం తో ఓటేశారు.అవినీతి రహిత పాలన ఉంటుందని పేదల సంక్షేమం కోరేలా కేసిఆర్ పాలన కొనసాగుతుందని ప్రజలు ఆశించారు. ఆ కలలు కల్లలయ్యాయి..కెసిఆర్ నాలుగున్నర సంవత్సరాలలో అవినీతి పాలన కొనసాగించారు. ప్రాజెక్టు ల రీడిజైనింగ్ మాత్రమే చేశారు. ప్రాజెక్టు ల పేర్లే మార్చడమే కాదు ఖర్చులు కూడా పెంచారు.రైతులు తెలంగాణ కోసం కొట్లాడితే ఇదే తెలంగాణలో నాలుగున్నర వేల మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు. రైతులకు బేడీలు వేసిన ఘనత కేసిఆర్ ది.దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం, ఇంటింటికి నీరు, కెజి టు పిజి లాంటి హామీలు పూర్తి చేయలేదు కాని తెలంగాణను అప్పుల్లో ముంచారు. రెండు లక్షల 60 వేల రూపాయల అప్పు ప్రతి కుటుంబం పై ఉంది. విద్యా వైద్యానికి డబ్బులు రాని కెసిఆర్ కు ప్రగతిభవన్ కోసం 3 వందల కోట్ల రూపాయలు ఎలా వస్తాయి. నిజాం షుగర్స్ కు కూడా డబ్బులు ఉండవు.. వంద రోజుల్లో తెరిపిస్తానని మర్చిపొయారు. పసుపు బోర్డు నాలుగేళ్లయినా ఎందుకు తేలేదు. ఇక్కడ కేసిఆర్ అక్కడ మోదీ అవినీతికి పాల్పడుతున్నారు. రాఫెల్ యుద్దవిమానాలను హిందుస్తాన్ ఏరోనాటికల్ కంపెనీకి యుపియె కాంట్రాక్టు ఇస్తే మోది ప్రైవేట్ సంస్త అయిన అనిల్ అంబానికి అప్పగించి 30 వేల కోట్లు దోచిపెట్టాడు.చౌకిదారు అని చెప్పిన మోది పెట్టుబడిదారుల కొమ్ముకాస్తున్నారు.మోది ఏ నిర్ణయం తీసుకున్నా కేసిఆర్ మద్దతు తెలుపుతున్నారు..నోట్ల రద్దు విపల ప్రయోగం అని ప్రపంచం మొత్తుకున్నా కేసిఆర్ మాత్రం మద్దతు తెలిపారు. మోదికి మద్దతు ఇవ్వడం లో కేసిఆర్ తో పాటు ఎమ్ ఐ ఎమ్ కూడా జత కూడింది. ప్రజల కలలు సాకారం చేసేది కాంగ్రెస్ మాత్రమే. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ వాసులు కూడా స్వరాష్త్ర సాదనలొ పనిచేశారు. గల్ఫ్ బాదితుల కోసం ఐదు వందల కోట్లు ఇస్తామని కెసిఆర్ మోసం చేసారు.పేదల ఖాతాలో 15 లక్షలు వేస్తామని మోది చెప్పి మోసం చేసారు.. నేను వేదిక ద్వారా చెప్పే ప్రతి మాట అమలు చేస్తా..అబద్దాన్ని గెలిపించాలనుకుంటే కేసిఅర్ మోదిల వైపు ఉండండి. కాంగ్రెస్ వస్తే రెండు లక్షల రుణమాపీ చేస్తామ్.ఒక్క విడతలోనే చేస్తాం.కర్ణాటక లో ఇదే చేశాము.పత్తి రైతులకు ఏడు వేల మద్దతు దర ఇస్తాం. నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తాం. కాంగ్రెస్ అధికారం లోకి రాగానే మొదటి సంవత్సరం లోనే లక్ష ఉద్యోగాల భర్తీ తొ పాటు నిరుద్యోగులకు మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తాం. కాంగ్రెస్ హయాం లొ ఏ ఒక్క కుటుంబ పరిపాలన ఉండదు.. అందరినీ సంఘటిత పరిచి అందరికీ ఆమోదయోగ్యమైన పాలన కొనసాగిస్తాం. కామారెడ్డి సభలొ ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అనంతరం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ,,,,,, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తమ బతుకులు బాగుపడతాయి అనుకున్న రైతులకు టిఆర్ఎస్ పార్టీ సంకెళ్లు వేసిన సంఘటన వరంగల్ జిల్లా లో జరిగిందని కేవలం మద్దతు ధర అడిగినందుకే రైతులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. రైతులకు రుణమాఫీ చేయకుండా, ఇవ్వకుండా ఎన్నికల ముందు కోసమే కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆరు లక్షల మహిళా సంఘాలు ఉన్నాయని ఒక్కొక్క సంఘానికి లక్ష రూపాయల చొప్పున గ్రాండ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా ఒక సంఘానికి 10 లక్షల రూపాయలు రుణాలు ఇచ్చే వడ్డీ ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చౌక ధరల దుకాణాల లో ఆరు కిలోల బియ్యం, కిరోసిన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందని, అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి 7 కిలోల సన్నబియ్యం, గతంలో ఇచ్చిన విధంగా ఉప్పు, చక్కెర గోధుమపిండి, మంచి నూనె, చింతపండు తదితర తొమ్మిది వస్తువులను అందజేస్తామన్నారు. గిరిజనులకు బియ్యంతో పాటు తొమ్మిది రకాల వస్తువులను ఉచితంగానే ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
రైతులకు వరాలు…. రైతులు పండించిన ధరకు మద్దతు ధరను వారు తెలిపారు. వరి, మొక్కజొన్న పంటకు క్వింటాలుకు రెండు వేలు,, పత్తి కి 7000 రూపాయలు, మిర్చి, పసుపుకు 10000 రూపాయలు, ఎర్ర జొన్నలకు మూడు వేల రూపాయల చొప్పున క్వింటాలుకు జరుగుతుందన్నారు. దళిత గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచితంగానే విద్యుత్తును అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి కుంతియా, శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్, జానారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మదన్మోహన్, ఎం జి వేణుగోపాల్ గౌడ్, గంగారం రెండు లక్షల వరకు మంది ప్రజలు పాల్గొన్నారు.