జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శమని భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్ అన్నారు. ఆనాడు అనేక ఏండ్లుఅధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం, అధికారం కోసం ప్రజలను మోసం చేసేలా అనేక హమీలు, పథకాలను అమలుచేశారే తప్ప ఏనాడు ప్రజల మేలు కోరే ఆలోచన చేయలేదన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను ఓటు బ్యాంకులుగా వాడుకున్నారని ఆమె ఆరోపించారు. గతంలో గురుకుల పాఠశాలలు ఉన్నప్పటికి ఏ పేద విద్యార్ధి ఆ పాఠశాలల్లో చదువుకునేందుకు ఇష్టపడలేదని, కానీ ఈనాడు ప్రతి ఒక్కరు గురుకులాల్లో చదువుకునేందుకు మొగ్గు చూపుతున్నారని, గురుకుల పాఠశాలలకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఆమె అన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం గొప్పగా ఆలోచన చేసే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌అని ఆమె అన్నారు. తనలాంటి పేద ఆడబిడ్డ ప్రజాప్రతినిధిగా ఉన్నామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలే కారణమని, తెలంగాణ వస్తే ఏమస్తది అన్న వాళ్లు ఈనాడు తనకు జెడ్పీ చైర్‌పర్సన్‌గా అవకాశం రావడం తెలంగాణ రావడంతోనే జరిగిందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటేనే అభివృధ్ది, సంక్షేమ పథకాలు సజావుగా అమలు అవుతాయని, సాధ్యంకాని పథకాలు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని ఆమె అబిప్రాయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల పనితీరు, ఈనాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరు గమనించి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అధికారం, పదవుల కోసం కాంగ్రెస్‌పాలకులు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారని, అలాంటి వారి మాటలు నమ్మితే మరో యాభై ఏండ్లువెనుకబడి పోతామని ఆమె అన్నారు. అన్ని రంగాల అభివృధ్ది కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందని ఆమె ఈసందర్బంగా స్పష్టం చేశారు. అంతకు ముందు ఐసీడీఎస్, మైనార్టీ, ఎస్సీ, గిరిజన, బీసీ కార్పోరేషన్‌ల ద్వారా అమలుచేసిన పథకాలు, లబ్దిదారుల వివరాలను ఆయాశాఖల అధికారులు వివరించారు. అనంతరం ఆయా శాఖల ఆధ్వర్యంలో పలువురికి చెక్కులు, బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కుమార్‌దీపక్, తహశీల్దార్ బండి ప్రకాష్, ఎంపీడీఓ రమేష్, ఎంపీపీలు జెడ్పీటిసిలు, పీఏసీఎస్ చైర్మన్‌లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం – భూపాలపల్లి జెడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేష్




