Tuesday, 3 November 2026

తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ద్వితీయ మహాసభలు.. తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వెబ్సైట్ ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా టౌన్ (జనం సాక్షి ):-తెలంగాణ పద్మశాలి సంఘం ద్వితీయ సభలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో యాదగిరిగుట్ట పట్టణంలో శుభం గార్డెన్ లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్ అధ్యక్షన ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడం జరిగింది మహాసభలు ముఖ్య అధ్యక్షులు అఖిలభారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి మహిళా విభాగ అధ్యక్షురాలు వనం దుశ్శాంతల మరియు తెలంగాణ ప్రాంత గారపల్లి సంధ్య ప్రధాన కార్యదర్శి మురళి పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం వెబ్ సైట్ ప్రారంభించారు అఖిలభారతపద్మశాలి సంఘం 16 రాష్ట్రాల్లో ప్రాంత అనుబంధ సంఘాలు కలిగి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏకైక సంఘం మన ఓటు మనకే మన సేటు మనకే అన్ని నినాదంతో పద్మశాలీలు ముందుకు వెళ్లాలి అలాగే ఆవిష్కరించిన వెబ్ సైట్ నుఆధారంగా సభ్యతాలు పొందవచ్చు ఇది శాశ్వతంగా ఉంటుంది దీని రుసువు ₹10 రూపాయలతో ఏర్పాటు చేశారని అన్నారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు పద్మశాలిలు తీసుకోవాలి కోరారు మన రాష్ట్రంలో పద్మశాలీలు 30 లక్షల పైగా జనాభా ఉండి కుడా పద్మశాలీలు ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనేమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చేనేతకారుల చేయూతనివ్వాలి ప్రతి పద్మశాలి కుటుంబానికి దళిత బందులాగా పద్మశాలి బందు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనంతరం యాదాద్రి జిల్లాలోని నూతనంగా ఎన్నికైన జిల్లా కార్యవర్గానికి నియమమిక పత్రం అందించారు వీరితోపాటు జిల్లా చేనేత విభాగాన్ని కూడా నేనొక పత్రం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెక్క వెంకటేశ్వర్లు ,టౌన్ అధ్యక్షులు ఆంజనేయులు, గౌరవ అధ్యక్షులు వంగారి బాల్ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి చింతకింద శ్రీధర్ , పోచం సోమయ్య ,కోశాధికారి శ్రీరామ్ సత్తయ్య ఆర్గనైజ్ సెక్రెటరీ గుండు ప్రసాద్ సెక్రెటరీ బింగి వైకుంఠం ఉపాధ్యక్షుడు శ్రవణ్ కన్నయ్య వీరితో పాటు వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పద్మశాలి సంఘం కుల బాంధవులు చేనేత కార్మికులు తదితరులుపాల్గొన్నారు.