Tuesday, 3 November 2026

సాయినాధుని సేవలో ఎమ్మెల్యే హరిప్రియ నాయక్..

ఇల్లందు జులై 3 (జనం సాక్షి న్యూస్ )భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోగురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక లలిత్ కళామందిర్ సమీపంలో గల సాయినాధుని ఆలయంలో ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఆది గురువు ఆవిర్భవించిన రోజే గురుపౌర్ణిమి అని, భక్తుల కోరికలు తీర్చే సాయినాధుని కొలిచే అవకాశం వచ్చిన వారు అందరూ ఎంతో ధన్యూలు అని బానోత్ హరిప్రియ నాయక్ కొనియాడారు.ఈ కార్యక్రమంలో గుడి కమిటీ సభ్యులు మల్లికార్జునరావు, సురేష్ సాహూ, డేరంగుల పోశం, స్థానిక 16వ వార్డు కౌన్సిలర్ రజిత రవి,ఇల్లందు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మనోహర్ తివారి, ఇల్లందు పట్టణ ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్ నెమలి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.