Wednesday, 4 November 2026

తెలంగాణ మీడియాపై వివక్షతకు నిరసనగా జనంసాక్షి ర్యాలి

కరీంనగర్‌: తెలంగాణ మీడియా పై సీమంధ్ర సర్కార్‌ వ్యతిరేకిస్తున్న విధానాల పట్ల జనంసాక్షి తన నిరసన వ్యక్తం చేసింది. ప్రధానిహజరైన జీవవైవిధ్య సదస్సుకు తెలంగాణ మీడియాను అనుమతించక పోవడం ముమ్మాటికి తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం వివక్షేనని ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం  తెలంగాణ మీడియాకు జరిగిన అవమానానికి నిరసనగా తెలంగాణ గుండె గోంతుక జనంసాక్షి తన బృందంతో భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. జనంసాక్షి ప్రధాన కార్యలయం నుండి జర్నలిస్టులు, సిబ్బందితో జైతెలంగాణ నినాదాలు చేసుకుంటూ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా బయలుదేరారు. అనంతరం తెలంగాణ చౌరస్తా వద్ద జనంసాక్షి, జర్నలిస్టుల ఫోరం సంయుక్తంగా రాస్తారోకో నిర్వహించారు. సీమాంధ్ర సర్కారు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలక్టరేట్‌ వెళ్లె దారిలో మానవహారం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *