Tuesday, 3 November 2026

తెలంగాణ యాదవ మహాసభ సీరోల్ మండల అధ్యక్షులుగా వంగ మధు యాదవ్ ఏకగ్రీవ ఎన్నిక

 

 

 

 

 

సిరోల్ జనవరి 30 /జనం సాక్షి న్యూస్:
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో జరిగినా సమావేశంలో ముఖ్యఅతిథిగా తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు సూత్రపు రాజు యాదవ్ మాట్లాడుతూ,యాదవ జిల్లా యువత సంఘ అభివృద్ధికై ముందుండాలి, యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలం యాదవుల భవిష్యత్తు సంఘం యొక్క యాదవ యువతపై ఆధారపడి ఉంది, యువత ఐక్యమధ్యంగా ఉండాలి ఐక్యమత్యంతోనే అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు, యాదవ యువత రాజకీయ రంగంలో అభివృద్ధి చెందాలని జిల్లా అధ్యక్షులు సూత్రపు రాజు యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది అనంతరం తెలంగాణ యాదవ మహాసభ సిరోల్ మండల అధ్యక్షులుగా వంగ మధు యాదవుని ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాద్యక్షులు నేతూల వెంకన్న యాదవ్, జిల్లా కార్యదర్శి చల్లా గోవర్ధన్ యాదవ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పోతుల ధీలీప్ యాదవ్, మహబూబాబాద్ మండల అధ్యక్షులు తోట నరేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు