Monday, 2 November 2026

పేదలకు వరం ముఖ్య మంత్రి సహాయనిధి – శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్

 

 

 

 

 

కురవి జనవరి 30/జనం సాక్షి న్యూస్:
మహబూబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం ఎమ్మెల్యే స్వగృహం ఉగ్గంపల్లి లో సోమవారం
కురవి,సీరోల్ మండలాల పలు గ్రామాల లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్. ఈ సందర్భంగా డోర్నకల్ నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల సంక్షేమ విధాత శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్ మాట్లాడుతూ నియోజవర్గంలోని మీ గ్రామాల్లో జరిగే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వాధినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ప్రతి పేదోడి అండగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి,బిఆర్ఎస్ మండల అధ్యక్షులు తోట లాలయ్య, సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి,బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవినాయక్, మాజీ యంపిపి రామచంద్రయ్య, మాజీ వైస్ ఎంపిపి పెద్ది వెంకన్న,బి ఆర్ ఎస్ యూత్ మండల అధ్యక్షుడు బానోత్ రమేష్, ఉపాధ్యక్షులునీలం నాగరాజు,మండల యూత్ ప్రధాన కార్యదర్శి జక్కుల సందీప్,చీమ్లతండ సర్పంచ్ మంగిలాల్,మూడ్ శ్రీను,సక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు..