మోమిన్ పేట జూన్ 10 జనం సాక్షిభారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందని రైతుల ప్రయోజనాల కోసం రైతుబంధు రైతు భీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర ప్రజలు విన్నపడి ఉండాలని మోమిన్ పేట మండలం రాళ్లగుడుపల్లి రైతుబంధు అధ్యక్షుడు డి లక్ష్మయ్య గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చౌహాన్ చందర్ నాయక్ మాజీ సర్పంచ్ అనంతయ్య లు పేర్కొన్నారు శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలు పరుస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు ప్రస్తుతం వ్యవసాయ రైతులకు ఖరీఫ్ సీజన్ కు పెట్టుబడి సహాయం ఈనెల 15 నుండి రైతులు అకౌంట్లో జమ చేయనున్నారని వారు తెలిపారు బి ఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్రంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రైతు బంధు రైతు బీమా పథకాలు అమలు చేయడానికి దేశంలో ముఖ్యమంత్రి చక్రం తిప్పుతున్నారని వారు అన్నారు దేశ ప్రజలందరూ కేసీఆర్ ప్రధానిగా చూడాలని ఆశపడుతున్నారన్నారు బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో అమలయ్యే ప్రజా సంక్షేమ పథకాలు దేశమంతా అమలు జరుగుతాయని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం




