వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 9 జనం సాక్షి2018 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నా ఆమెని తుంగలో తొక్కారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సత్యభారతి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన
రెడ్డి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో సత్యభారతి ఫంక్షన్ హాల్ లో రెడ్డి కులాల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ కోసం ఏర్పాటు చేయడానికి పదివేల కోట్ల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులను దారి మళ్లించి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా రెడ్డి కులాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు. రెడ్డిల బతుకులు బాగుపడాలంటే వచ్చే ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వస్తే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కులాలను విస్మరిస్తూ కమ్మ కాపు కులాలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టి రెడ్డి కులాలతో చెలగాటమాడటం మానుకోవాలని ఆయన ఇతవు పలికారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిల కు కులాలకు మద్దతు తెలిపిన పార్టీలకే మనుగడ ఉంటుందని లేనిచో ఎన్నికల్లో ఆ పార్టీలకు గుణపాఠం తప్పదన్నారు. అనంతరం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామానికి చెందిన నిరుపేద రెడ్డి కులానికి చెందిన నవాజ్ రెడ్డి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఉడతా భక్తిగా కొండ విశ్వేశ్వర్ రెడ్డి 25 వేల రూపాయలను అలాగే 25000 ప్రతాప్ రెడ్డి 25000 సుభాన్ రెడ్డి మిగతావారు 25000 ఇచ్చారు. సుమారు లక్ష రూపాయలు ఆర్థిక సాయం వారి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో రాందేవ్ రెడ్డి కొండా వీరారెడ్డి రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు మద్ది బుచ్చిరెడ్డి జిల్లా కార్యదర్శి చరణ్ రెడ్డి ఉపాధ్యక్షులు మాణిక్య రెడ్డి శ్రీదేవి సదానంద రెడ్డి అనిత శ్రీధర్ రెడ్డి. సుజాత వేణుగోపాల్ రెడ్డి రత్నారెడ్డి అమర్నాథ్ రెడ్డి పిల్లారం మైపాల్ రెడ్డి చంద్రకళ కమల్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి మైపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పోలీస్ రామ్ రెడ్డి కృష్ణారెడ్డి పగిడాల నరసింహారెడ్డి జిల్లాలోని రెడ్డి సోదరులు రాజకీయాలకతీతంగా భారీ సంఖ్యలో పాల్గొన్నారు




