వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 9 జనం సాక్షివ్యవసాయ రైతులకు ఏకకాలంలోనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసి కౌలు రైతులకు కూడా ఆదుకుంటామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం బంట్వారం మండల పరిధిలోని మంగరాజు పల్లి గ్రామంలో హత్సే హత్ జోడు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే నిత్యవసర వస్తువుల ధరలువిపరీతంగా పెంచి సామాన్య ప్రజలను నడ్డి బిరుస్తున్నారని ఆయన ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు రక్షించుకో వడం కోసం బిజెపితో కలిసి నాటకాలు ఆడుతున్నారని బిజెపి భారత రాష్ట్ర సమితి పార్టీలు రెండు ఒకటేనని చీకటి ఒప్పందంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మరుక్షణమే దళితులకు మూడెకరాల భూమి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో వస్తాయన్నారు సొంత ఇంటి స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణానికి డబ్బులు కేటాయిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి మాట చెప్పారని ఆయన ఆరోపించారు అనంతరం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో బంటారం సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వారి అనుచరులతో కలిసి బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారుఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశం జెడ్పిటిసి సంతోష సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతి రెడ్డి శ్రీనివాస్ ముదిరాజ్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు




