తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ
నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు
500 రూపాయలకే వంట వంట గ్యాస్ సరఫరా
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ రూరల్ ఆగస్టు 29 జనం సాక్షి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని నిరుద్యోగ యువతీ యువకులకు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు లేదా నాలుగువేల రూపాయల నిరుద్యోగ భృతి 500 రూపాయలకే వంట గ్యాస సరఫరా చేస్తామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం ధరూర్ మండల పరిధిలోని తిమ్మా నగర్ గ్రామంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో ఉన్న బి ఆర్ ఎస్ పార్టీలో కలిసి దేశాన్ని ఒకరు రాష్ట్రాన్ని ఒకరు కలిసి దోచుకుంటున్నాయని ఆయన ఆలోచించారు కులాల పేరుతో దళిత బంధు బీసీ బందు మైనారిటీ బందు అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్ళించి నిరుద్యోగ యువతీ యువకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించడం మర్చిపోయి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు దేశంలో శాంతి యుత పాలన రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన సూచించారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే బిజెపి బి ఆర్ ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘువీరారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి రాములు ఏఐసీసీ సభ్యుడు సంతోష్ బాబా ఖాన్ అంజయ్య ఆశయ గోపాల్ నాయక్ రాజు నాయక్ భాస్కర్ జాకీర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు