హుజూర్ నగర్ మే 2 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులకు మహర్దశ వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని 15 వార్డులో గల యుపిఎస్ నెంబర్ వన్ పాఠశాల నందు ఆ వార్డ్ కౌన్సిలర్ కేఎల్ఎన్ రావు ఆధ్వర్యంలో అదనపు తరగతి గదుల నిర్మాణం కొరకు రూ. 81 లక్షల రూపాయలతో నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి
మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బడులను పట్టించుకోకుండా శిధిలావస్థకు తీసుకువచ్చారని, నేడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. గత పాలకులు నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని, నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ రోజు కూడా నియోజకవర్గంలో ఒక్క బడికి వచ్చింది, చేసింది ఏమి లేదని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే పేద ప్రజలందరికి అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎండీ. షర్మిల, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పట్టణ యూత్ అధ్యక్షులు సోమగాని ప్రదీప్, జాగృతి పట్టణ మహిళా అధ్యక్షురాలు షేక్.రహిమా, మాజీ పట్టణ అధ్యక్షుడు దయాకర్, హుజూర్ నగర్ మండల పి ఆర్ టి యు అధ్యక్షులు వేముల శ్రీనివాస్, మాజీ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకారెడ్డి, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, కళావతి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ బడులకు మహర్దశ – ప్రభుత్వ బడుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి రూ. 81 లక్షల రూపాయలతో నూతన భవనానికి శంకుస్థాపన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి




