సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 8 :-తెలంగాణ రాష్ట్రంలో నేడు మత్స్యకారులకు పండగని ప్రభుత్వం మత్స్యకారులకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, పిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ పులిమామిడి రాజు అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని వెలుగు కార్యాలయం ఆవరణలో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, పిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ పులిమామిడి రాజు పాల్గొన్నారు. ఈ ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ రుచికరమైన రకరకాలైన చేపల వంటకాలు 8 స్టాళ్ల ద్వారా ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలొ భాగంగా ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, ఒకప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ లకు, గంగపుత్రులకు అనేక నూతన మత్స్య సహకార సంఘలు ఏర్పాటు చేయించి, ఉచిత చేప పిల్లల పంపిణి చేశారన్నారు. చేపలను మార్కెట్లో అమ్మడానికి ప్రయాణ సౌకర్యర్థం టివిఎస్ మొపేడ్లు, డిసిఎం లు, మత్స్యకారుల సొసైటిల కోసం సుమారు 518 కమ్యూనిటీ హాలు నిర్మించారాని తెలిపారు. ఇలా అనేక రకాలుగా వివిధ సంక్షేమ ఫలాలు మత్స్యకారుల కొరకు ప్రత్యేకంగా అందిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఏడి సతీష్ కు మత్స్య సహకార సంఘాలలో నూతన సభ్యత్వల విషయంలో అధికారులు సహకరించాలని కోరారు. చనిపోయిన మత్స్యకారులకు ఇన్సూరెన్స్ ల విషయంలో తొందరగా క్లెయిమ్ అయ్యేలా చూడాలని అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మత్సకార్మికుడికి పింఛన్ కేటాహించే విధంగా కలెక్టర్ శరత్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట ఉపాధ్యక్షులు నారాయణ, గుండు వెంకన్న, ఉమ్మడి మెదక్ జిల్లా మత్సపారిశ్రమిక సంఘం చైర్మన్ గున్నాల నర్సింలు, సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది జడ్పీటీసీ కొండల్ రెడ్డి , మాజీ సిడిసి చైర్మన్ విజేందరెడ్డి, జిల్లా కమిటీ ముదిరాజ్ సంఘం సభ్యులు, నియోజకవర్గ సభ్యులు, మండల కన్వీనర్లు, పిఎంఆర్ యువసేన నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు పండుగ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదు




